పూరీజగన్నాథ్, వరుణ్‌తేజ్‌ల కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుందని ఓ ప్రెస్‌నోట్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అది నిజమా? కాదా? అనే సందేహాలు ఇప్పుడు కలుగుతున్నాయి. ఎందుకంటే నితిన్ ప్రాజెక్ట్ ప్రారంభం కావాల్సిన రోజే ఈ సినిమాని ప్రారంభిస్తామని చెప్పాడు పూరీ. ఆ లెక్క ప్రకారం జూన్ 15న ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కావాల్సివుంది. కానీ అలాంటిదేమీ జరగలేదు. చిరంజీవితో చిత్రం స్క్రిప్ట్ పూర్తి నేరేషన్ పూర్తి అయిందంటూ పూరీ ట్వీట్ చేశాడు. అందులో ఎక్కడా వరుణ్‌తేజ్ సినిమా గురించి ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో వరుణ్‌తేజ్‌తో ప్రాజెక్ట్ ఉంటుందా? ఉండదా? అనేది అందరిలో ఆసక్తికరమైన అంశంగా మారింది.