నాగశౌర్య సరసన నాని హీరోయిన్‌...!

‘అలా మొదలైంది’ చిత్రంతో సంచలనం సృష్టించిన లేడీ  డైరెక్టర్‌ నందిని రెడ్డి ఆ తర్వాత తీసిన ‘జబర్దస్త్‌’తో నిరాశపరిచింది. మరలా చాలా గ్యాప్‌ తర్వాత ఆమె నాగశౌర్య హీరోగా ఓ చిత్రం చేస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో నాగశౌర్య సరసన హీరోయిన్‌గా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఫేమ్‌ మాళవికనాయర్‌ నటిస్తోంది. కాగా ఈ చిత్రానికి కళ్యాణ్‌కోడూరి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంతో మరలా తన సత్తా చాటాలని నందినిరెడ్డి పట్టుదలతో ఉంది. కాగా నాగశౌర్య విషయానికి వస్తే ఆయన నటించిన ‘జాదూగాడు’ చిత్రం ఈనెల 26న విడుదలకు ముస్తాబవుతోంది.

nagasowrya
malavika nair
alamodalaindi
nandini reddy