తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పటినుంచి డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ సీఎం కేసీఆర్‌కు పెద్ద ఫ్యాన్‌గా మారాడు. సీఎం కేసీఆర్‌ను పొగుడుతూ పలుమార్లు ఆయన సోషల్ మీడియాలో కామెంట్లు కూడా పెట్టిన సంగతి తెలిసింది. మరోసారి ఓటుకు నోటు కేసులో కేసీఆర్‌ను పూర్తిగా సమర్థించిన వర్మ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశాడు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు చేసిన పనికి తాను ఆంధ్రపౌరుడినని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నట్లు వర్మ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రం పరువు తీశాడని వాపోయారు. పాలనతో చంద్రబాబు కంటే కేసీఆర్ ఎంతో ముందున్నారని కొనియాడారు. అంతేకాకుండా కేసీఆర్ ముక్కుసూటితనానికి తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. ఇక రేవంత్‌రెడ్డి గురించి మాట్లాడుతూ.. రాజకీయాల్లో రేవంత్ చాలా క్రీయాశీలకంగా ఉండేవాడని, దూకుడుగా వ్యవహరించేవాడని, అనవసరంగా ఈ స్కాంలో ఇరుక్కున్నట్లు చెప్పారు. వివాదాస్పద ఘటనలపై సినిమాలు తీసే వర్మకు మరి ఓటుకు నోటు ఘటన కూడా ఓ కథలా పనికొస్తుందేమో వేచిచూడాలి.