ప్రేక్షకులు, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘గబ్బర్‌సింగ్2’ షూటింగ్ మే 29న మహారాష్ట్రలో ప్రారంభమైంది. ఐదు రోజులపాటు ఈ షెడ్యూల్ జరిగింది. ఈ షెడ్యూల్‌లో పవన్‌కళ్యాణ్ పాల్గొనలేదు. కారణం ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. ఈ సినిమా వుంటుందా? లేదా? అనే డౌట్స్‌తోనే షూటింగ్ స్టార్ట్ అయింది. అయితే షూటింగ్‌కి పవన్‌కళ్యాణ్ రాకపోవడంతో ఇండస్ట్రీలో అప్పుడే ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. 5 రోజుల చిన్న షెడ్యూల్ కావడంతో పవన్‌కళ్యాణ్ లేని సన్నివేశాల్ని చిత్రీకరించారని తెలిసిందే. నెక్స్‌ట్ హైదరాబాద్‌లో జరిగే షెడ్యూల్‌లో పవన్‌కళ్యాణ్ పాల్గొంటాడని తెలిసింది. ఈమధ్య బాగా గడ్డం పెంచిన కళ్యాణ్ ఇప్పుడు క్లీన్ షేవ్‌తో కనిపిస్తున్నాడట. గబ్బర్‌సింగ్ 2 కోసమే గడ్డం పెంచాడని అందరూ అనుకున్నారు. అయితే అలాంటిదేమీ లేదని, షూటింగ్స్ లేని టైమ్‌లో అలా గడ్డం పెంచడం అలవాటని అతని సన్నిహితులు చెప్తున్నారు. మరో విషయం ఏమిటంటే ఇది గబ్బర్‌సింగ్‌కి సీక్వెల్ కాదట. అసలు గబ్బర్‌సింగ్‌కి, ఈ సినిమాకి ఎలాంటి సంబంధం లేదు. ఈ కథ పవన్‌కళ్యాణ్ స్వయంగా రాసుకున్నదని తెలిసింది. ఈ సినిమా టైటిల్ కూడా మారుతుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అదే నిజమైతే పవన్‌కళ్యాణ్ రాసుకున్న ఈ కథకి అతను ఏ టైటిల్ నిర్ణయిస్తాడో వెయిట్ అండ్ సీ.