Advertisementt

ఒక్క డిజాస్టర్‌తో సీనియర్‌ దర్శకునికి కోలుకోలేని దెబ్బ..!

Tue 16th Jun 2015 07:26 AM
ks ravikumar,linga,kannada movies,sudeep,action entertainer  ఒక్క డిజాస్టర్‌తో సీనియర్‌ దర్శకునికి కోలుకోలేని దెబ్బ..!
ఒక్క డిజాస్టర్‌తో సీనియర్‌ దర్శకునికి కోలుకోలేని దెబ్బ..!
Advertisement
Ads by CJ

కె.యస్‌.రవికుమార్‌.. నిన్న మొన్నటి వరకు తమిళంలో తిరుగులేని సీనియర్‌ డైరెక్టర్‌. అయితే ఇటీవల రజనీకాంత్‌తో ఆయన తీసిన ‘లింగా’ చిత్రం డిజాస్టర్‌ అయి నిర్మాతతోపాటు రజనీని కూడా ముప్పుతిప్పలు పెట్టడంతో ప్రస్తుతం ఆయనతో సినిమా చేయాలని ఏ హీరో కోరుకోవడంలేదు. ఇక ఆయన దర్శకుడైతే పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలతోపాటు ఫైనాన్షియర్లు కూడా మొగ్గుచూపడం లేదు. దాంతో ఈ టాలెంటెండ్‌ డైరెక్టర్‌ కన్నడ చిత్రాలపైకి చూపులు తిప్పాడు. అక్కడయితే తనకు బాగా అవకాశాలు వస్తాయనే ఆశతో ఉన్న ఆయన త్వరలో కన్నడస్టార్‌ సుదీప్‌ (‘ఈగ’ ఫేమ్‌) హీరోగా ఓ పక్కా యాక్షన్‌ మూవీని తెరకెక్కించనున్నాడు.   ఈచిత్రంపై సుదీప్‌ కూడా ఆశలు పెట్టుకొని ఉన్నాడట. ఎంతైనా పెద్దగా క్రేజ్‌లేని కన్నడ పరిశ్రమ అనేక మంది పరభాషా ఫ్లాప్‌ డైరెక్టర్లను ఆదరిస్తోందని చెప్పవచ్చు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ