పూరీజగన్నాథ్, వర్మ వంటి దర్శకుల రూటు ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. అయితే అటు..కాకపోతే ఇటు అనేది వారి నైజం. కాగా ఆ లిస్ట్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చేరిపోయాడట. ప్రస్తుతం ఏ సినిమా చేద్దామన్నా హీరోలు ఖాళీగా లేరు. త్రివిక్రమ్ ఎప్పుడు చేద్దామంటే అప్పుడు రెడీ అన్నట్లుగా ఉన్న హీరోలు కూడా ప్రస్తుతం తమ తమ కమిట్‌మెంట్లతో బిజీగా ఉన్నారు. దీంతో త్రివిక్రమ్ తాజాగా ఓ హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడట. ఇందుకోసం ఓ స్టోరీ పాయింట్‌ను సిద్దం చేసుకొని ఆఘమేఘాల మీద స్క్రిప్ట్‌పై కసరత్తు చేస్తున్నాడని సమాచారం. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో త్రివిక్రమ్‌తో ఓ స్టార్ హీరో చేయాలంటే కనీసం ఆరునెలల టైమ్ పట్టేట్టు ఉంది. దీంతో ఆయన ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల నిర్మాత రాధాకృష్ణ నిర్మాణంలో సమంత ప్రధానపాత్రలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడని టాక్. మరి త్రివిక్రమ్ కల ఫలిస్తుందో లేదో వేచిచూడాల్సివుంది...!