పూరీజగన్నాథ్ మెగాస్టార్ చిరంజీవితో 150వ సినిమా చేసే గ్యాప్‌లో మరో చిత్రం చేయాలని భావించాడు. అందుకే ఆయన వెంటనే నితిన్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. కానీ చివరకు ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌తో సినిమా చేస్తున్నట్లు హడావుడిగా ప్రకటన చేశాడు. అయితే ప్రస్తుతం వరుణ్‌తేజ్ ఒడివడిగా అడుగులు వేయకుండా కెరీర్ సెటిల్ అయ్యే వరకు ఆచితూచి అడుగులు వేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. నాగబాబు ప్లానింగ్ కూడా అదే. ‘ముకుంద’ పెద్దగా ఆడకపోయే సరికి వరుణ్‌తేజ్ ఒకేసారి రెండు మూడు చిత్రాలు చేయకుండా ఒకదాని తర్వాత మరోటి అనే ఉద్దేశ్యంలో ఉన్నాడు. కాగా ప్రస్తుతం ఆయన క్రిష్ దర్శకత్వంలో ‘కంచె’ సినిమా చేస్తున్నాడు. కానీ అంతలోనే పూరీ హడావుడిగా వరుణ్‌తేజ్‌తో సినిమా అనౌన్స్ చేయడం... ఈ విషయమై చివరి నిమిషం వరకు వరుణ్‌కు గానీ నాగబాబుకు గానీ చెప్పకపోవడంతో హడావుడిగా ఇలా ఎందుకు అనౌన్స్ చేశావు? అని పూరీపై సీరియస్ అయ్యాడని సమాచారం. మరి పూరీతో వరుణ్ సినిమా ఉంటుందా? లేదా? అనే విషయంపై ఫిల్మ్‌నగర్‌లో తీవ్ర చర్చ జరుగుతోంది.