Advertisementt

అదంతా పూరీ చేసిన గిమ్మిక్‌...!

Tue 16th Jun 2015 05:40 AM
poorijagannath,charmi,jyothilakshmi,kalyan,jyothilakshmi part2  అదంతా పూరీ చేసిన గిమ్మిక్‌...!
అదంతా పూరీ చేసిన గిమ్మిక్‌...!
Advertisement
Ads by CJ

‘జ్యోతిలక్ష్మీ’ విడుదలకు ముందే ఈ చిత్రానికి సీక్వెల్‌ తీసే ఆలోచన ఉన్నట్లు పూరీ, చార్మి, సి.కళ్యాణ్‌లు ప్రకటించారు. తీరా చూస్తే ఈ కథకి సీక్వెల్‌ లక్షణాలు లేవు. ‘జ్యోతిలక్ష్మీ’ క్యారెక్టరైజేషన్‌ గానీ, ఈ కథను గానీ కంటిన్యూ చేసే వీలే లేదు అని స్పష్టం అవుతోంది. ఏ ఉద్దేశ్యంతో పూరీ సీక్వెల్‌ చేద్దామనుకున్నాడో అర్థం కావడం లేదు. దీన్ని పూరీ చేసిన పబ్లిసిటీ గిమ్మిక్కుగా భావించాల్సివస్తుంది. ఓ సినిమా విడుదలకు ముందే సీక్వెల్‌ చేస్తామనో, మరేదో ప్రకటిస్తే ఆ చిత్రంపై వారి కున్న నమ్మకం చూసి బయ్యర్లు, ప్రేక్షకులు మరింతగా ఆ చిత్రం చూడాలని ఆసక్తి చూపిస్తారనే సంగతి తెలిసిందే. ‘జ్యోతిలక్ష్మీ’ విషయంలో కూడా పూరీ, చార్మి, సి.కళ్యాణ్‌లు ఈ ట్రిక్‌ను ప్లే చేశారు. అయితే ఈ సినిమాకు వస్తున్న స్పందన, ఈ చిత్రంపై వస్తున్న రివ్యూలు చూసిన తర్వాత అయినా పూరీకి నిజంగా సీక్వెల్‌ ఆలోచన ఉంటే ఆ ఆలోచనను పక్కనపెట్టడం ఖాయమంటున్నారు విమర్శకులు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ