Advertisementt

మళ్లీ ‘ఆగడు’ కాంబినేషన్‌...!

Tue 16th Jun 2015 04:00 AM
mahesh babu,sreenuvaitla,aagadu,nenokkadine,14 reels entertainment  మళ్లీ ‘ఆగడు’ కాంబినేషన్‌...!
మళ్లీ ‘ఆగడు’ కాంబినేషన్‌...!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు కెరీర్‌లో సూపర్‌హిట్‌ చిత్రం ‘దూకుడు’. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో మహేష్‌ కెరీర్‌లోనే హయ్యస్ట్‌ గ్రాసర్‌గా నిలిచింది. ఆ తర్వాత ఇదే కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆగడు’ చిత్రం భారీ ఫ్లాప్‌ నిలిచింది. ఈ రెండు చిత్రాలను నిర్మించింది 14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థే కావడం విశేషం. అంతేగాక 14రీల్స్‌ సంస్థ మహేష్‌తో చేసిన ‘1’ (నేనొక్కడినే) కూడా భారీ డిజాస్టర్‌గా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం త్వరలో మహేష్‌బాబు `శ్రీనువైట్ల కాంబినేషన్‌లో మరో చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో మొదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రానికి గాను మహేష్‌బాబు, శ్రీనువైట్లలు రెమ్యూనరేషన్‌ తీసుకోకుండా ఉచితంగా ఈ చిత్రం చేయనున్నారు. 14రీల్స్‌ సంస్థకు తమ వల్ల వచ్చిన ఆర్థిక నష్టాలను పూడ్చడానికే వారు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ