Advertisementt

మరో రీమేక్‌కి రెడీ అవుతున్న హీరో?

Tue 16th Jun 2015 03:19 AM
hero venkatesh,malayalam movie bhaskar the rascal,bhaskar the rascal remake in telugu,nayanatara in bhaskar the rascal remake  మరో రీమేక్‌కి రెడీ అవుతున్న హీరో?
మరో రీమేక్‌కి రెడీ అవుతున్న హీరో?
Advertisement
Ads by CJ

తెలుగు హీరోల్లో ఎక్కువ రీమేక్‌లు చేసి సూపర్‌హిట్‌ కొట్టిన హీరో వెంకటేష్‌ మాత్రమే అని చెప్పాలి. ఇప్పటివరకు వెంకటేష్‌ చేసిన రీమేక్స్‌లో ఫెయిల్యూర్‌ అయిన సినిమాలు తక్కువ. లేటెస్ట్‌గా మలయాళంలో సూపర్‌హిట్‌ అయిన ‘దృశ్యం’ చిత్రాన్ని వెంకటేష్‌తో అదే పేరుతో రీమేక్‌ చేశారు. అది కూడా సూపర్‌హిట్‌ అయింది. ఇప్పుడు మరో మలయాళ సూపర్‌హిట్‌ చిత్రం సురేష్‌ ప్రొడక్షన్స్‌ని ఎట్రాక్ట్‌ చేసిందట. మమ్ముట్టి, నయనతార జంటగా సిద్ధిక్‌ దర్శకత్వంలో రూపొందిన ‘భాస్కర్‌ ది రాస్కేల్‌’ ఈ సంవత్సరం ఏప్రిల్‌ 15న విడుదలై సూపర్‌హిట్‌ అయింది. ఆరున్నర కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం 16 కోట్లు కలెక్ట్‌ చేసి సంచలనం సృష్టించింది. ఈ చిత్రం రీమేక్‌ రైట్స్‌ని సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి.సురేష్‌బాబు సొంతం చేసుకున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ఎనౌన్స్‌ చేయనప్పటికీ రీమేక్‌కి సంబంధించిన డిస్కషన్స్‌ జరుగుతున్నాయని సమాచారం. మలయాళంలో హీరోయిన్‌గా నటించిన నయనతార తెలుగులో కూడా నటించే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. మలయాళంలో సూపర్‌హిట్‌ అయిన ‘దృశ్యం’ చిత్రాన్ని రీమేక్‌ చేసి సూపర్‌హిట్‌ కొట్టిన సురేష్‌ ప్రొడక్షన్స్‌ ‘భాస్కర్‌ ది రాస్కేల్‌’ చిత్రాన్ని కూడా సూపర్‌హిట్‌ చిత్రంగా నిలబెడుతుందంటారా?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ