2007లో వచ్చిన ‘శంకర్‌దాదా జిందాబాద్’ తర్వాత మెగాస్టార్ హీరోగా మరో సినిమా రాలేదు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళి చిరు సినిమాను పక్కన పెట్టిన విషయం తెలిసిందే. అయితే గత కొన్నాళ్ళు చిరంజీవి సినిమా చెయ్యబోతున్నారని, ఆయన నటించే 150వ సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తారన్న విషయంలో చాలా తర్జన భర్జనలు జరిగిన తర్వాత ఫైనల్‌గా ఆ సినిమా చేసే అవకాశం పూరికి దక్కింది. ‘ఆటోజానీ’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా ఆగస్ట్‌లో సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఇదిలా వుంటే ఈ సినిమా కథ ఎలా వుండబోతోంది అనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సంబంధించి రకరకాల కథలు ప్రచారంలో వున్నాయి. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వుండబోతోందని, నెక్స్‌ట్ ఎలక్షన్స్‌కి ఉపయోగపడేలా కథను రెడీ చేస్తున్నారని కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఇవేవీ సినిమాలో వుండవని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. 2000 తర్వాత వచ్చిన చిరంజీవి సినిమాల్లో ఠాగూర్, స్టాలిన్ చిత్రాల్లో మెసేజ్, శంకర్ దాదా ఎంబిబిఎస్, శంకర్‌దాదా జిందాబాద్ చిత్రాల్లో మెసేజ్‌తోపాటు ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్ అయి వుంది. ‘ఆటోజానీ’లో మాత్రం ఎలాంటి మెసేజ్‌లు, సెంటిమెంట్స్ అనేవి లేకుండా కేవలం ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేసే అంశాలు మాత్రమే వుంటాయట. 1990 దశకంలో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా వచ్చిన చిరంజీవి సినిమాల్లాగే ‘ఆటోజానీ’ కూడా వుంటుందట. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ఆటోజానీ అనే టైటిల్ తీసుకున్న ‘రౌడీ అల్లుడు’ చిత్రంలో ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ వుంటుందో అలాంటి ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇప్పుడు పూరి జగన్నాథ్ స్టైల్‌లో ‘ఆటోజానీ’ చిత్రంలో చూస్తామన్నమాట. అంటే తన అభిమానుల్ని పాతిక సంవత్సరాల వెనక్కి తీసుకెళ్ళి ఎంటర్‌టైన్ చెయ్యబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి.