చిరంజీవి 150వ సినిమా గురించి రకరకాలుగా ప్రచారం సాగుతోంది. ఆ సినిమాకి పూరి దర్శకత్వం వహించబోతున్నాడని ఆ మధ్య చిరు మొదలుకొని రామ్‌చరణ్ వరకు అంతా అధికారికంగా స్పష్టం చేశారు. కానీ పూరి ఆ సినిమా సంగతుల్ని చెప్పకుండా ఇతరత్రా చిత్రాలతో బిజీ అవుతుండటం చూసి... చిరు 150వ సినిమాకి దర్శకత్వం వహించే ఛాన్స్‌ని పోగొట్టుకొన్నాడనే పుకార్లు వినిపించాయి. అయితే పూరి మాత్రం ఒకపక్క తన కొత్త చిత్రాలతో పాటు... మరోపక్క చిరు 150వ సినిమా కోసం ఏర్పాట్లు చేసుకొంటూనే ఉన్నాడు. కథ విషయంలో ఆయన టీమ్ కసరత్తులు చేస్తూనే ఉంది. ఫస్ట్‌హాఫ్ కథని తయారు చేసి చిరుకి శనివారం వినిపించాడట పూరి. ఆ కథని విని చిరు థ్రిల్ల్‌గా ఫీల్ అయ్యాడట. ఇక సెకండ్‌హాఫ్ అంతకంటే పది రెట్లు అద్భుతంగా ఉండేలా కష్టపడతా అని ట్వీట్ చేశాడు పూరి. దీన్నిబట్టి చిరు 150వ సినిమాకి దర్శకుడు పూరినే అని స్పష్టమవుతోంది. ఆ విషయంలో ఎలాంటి మార్పులు లేవని ఖరారైపోయింది.