పూరీ ,నితిన్‌ల కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందనుందని ఈ ఇద్దరి నుండి ప్రకటనలు వచ్చాయి. అయితే ఈ మూవీకి సడన్‌గా బ్రేక్‌లు పడ్డాయి. కొన్ని విషయాల్లో పూరీ`నితిన్‌ల మధ్య విభేదాలు రావడమే దానికి కారణం అంటున్నారు. ఈ చిత్రాన్ని పూరీ తానే సొంతంగా నిర్మించాలని భావించాడట. కానీ నితిన్ తన సొంత బేనర్‌లో చేడ్డామని పట్టుబట్టాడని సమాచారం. దీంతో ఇద్దరి మద్య అభిప్రాయబేధాలు పొడసూపాయి. అలాగే చార్మిని తన సినిమాకు సహనిర్మాతగా పెట్టాలని పూరీ భావించడం నితిన్‌కు నచ్చలేదని, దీనికి నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి కూడా అభ్యంతరం చెప్పడంతో ఈ వివాదం చినికి చినికి గాలివానలా మారిందని సమాచారం.