Advertisementt

ఇద్దరి పరిస్థితి అగమ్యగోచరం..!

Sat 13th Jun 2015 08:25 AM
sukumar,boyapati srinu,bvsn prasad,ntr,geetha arts  ఇద్దరి పరిస్థితి అగమ్యగోచరం..!
ఇద్దరి పరిస్థితి అగమ్యగోచరం..!
Advertisement
Ads by CJ
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఇద్దరు టాప్‌ అండ్‌ యంగ్‌డైరెక్టర్లు తమ సినిమాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిద్దరే బోయపాటి శ్రీను, సుకుమార్‌. బోయపాటి డైరెక్షన్‌లో అల్లుఅర్జున్‌ హీరోగా గీతాఆర్ట్స్‌ బేనర్‌లో ఓ చిత్రం ప్రారంభం కావాల్సివుంది. అయితే పూజా కార్యక్రమాలు జరిగినప్పటికీ  ఈ చిత్రం సెట్స్‌పైకి ఎప్పుడు వెళుతుందో తెలియడం లేదు. ఇక సుకుమార్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మించే చిత్రం కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. తాజాగా ఈ చిత్రం ఈనెల 25 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌కు వెళ్లడానికి సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం 25 వ తేదీన లండన్‌లో ప్రారంభం అవుతుందని, అక్కడ దాదాపు 45రోజుల పాటు షూటింగ్‌ జరుగుతుందని, ఈ షెడ్యూల్‌లో పాటలను, కీలకసన్నివేశాలను చిత్రీకరిస్తారని సమాచారం. మరి ఈ చిత్రమైనా అదే తేదీన ప్రారంభం అవుతుందో లేదో చూడాల్సివుంది..! 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ