Advertisementt

రీషూట్‌ చేయడమే ఆలస్యానికి కారణమా..?

Sat 13th Jun 2015 08:18 AM
kick2,raviteja,kalyan ram,surendar reddy  రీషూట్‌ చేయడమే ఆలస్యానికి కారణమా..?
రీషూట్‌ చేయడమే ఆలస్యానికి కారణమా..?
Advertisement
Ads by CJ
సినిమా రిలీజ్‌ అయ్యాక ఫలానా సీన్‌ బాగోలేదనో, లేదా ఇంకా బాగా తీసి ఉంటే బాగుండేదనో అనుకుని ఎన్నిసార్లు మొత్తుకున్నా ఫలితం ఉండదు. అవి స్టార్‌ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లకు బాగా తెలుస్తాయి. అందుకే వారు మాగ్జిమమ్‌ శాటిస్‌ఫై అయ్యేవరకు  తీస్తూనే ఉంటారు. అటువంటి దర్శకుల్లో సురేందర్‌రెడ్డి ఒకరు. ఆయన తాను అనుకున్నది అనుకున్నట్లుగా రాకపోతే మళ్లీ మళ్లీ కష్టపడటానికి వెనుకాడడు. అదే ప్రాసెస్‌లో రీషూట్స్‌ చేస్తుండటం వల్లే రవితేజ హీరోగా నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మాతగా ఆయన తీస్తున్న ‘కిక్‌2’ చిత్రం లేటవ్వుతోందని సమాచారం. అంతేగాక ఈ చిత్రానికి నిడివి సమస్య కూడా వెంటాడుతోందని, ఏ సీన్‌ను ఎడిట్‌ చేద్దామన్నా కూడా సురేందర్‌రెడ్డి అంగీకరించకపోతుండటం వల్ల ఈ సినిమా విడుదల ఆలస్యంగా జరుగుతోందని సమాచారం. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ