అల్లుశిరీష్ హీరోగా ఇప్పటివరకు ఒక్క హిట్‌ను కూడా అందుకోలేదు. అంతేగాదు.. ఆయన నటించిన చిత్రాల్లో ఆయన నటనపై అనేక విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా ఆయన తన బాడీని పెంచి సిక్స్‌ప్యాక్ సాదించాడు. అదీ ఒక సినిమా కోసమే. పరుశురామ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రాన్ని జూన్ 11న ప్రారంభించనున్నారు. కాగా ఈచిత్రానికి ‘మేరీజాన్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. కాగా ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నాడు. గీతాఆర్ట్స్ బేనర్‌లో రూపొందనున్న ఈచిత్రం కోసం హీరోయిన్ అన్వేషణ మాత్రం పూర్తికాలేదు. మరి ఈ చిత్రమైనా అల్లుశిరీష్‌కు అనుకున్నంత పేరును తెస్తుందేమో వేచిచూడాలి..!