అల్లుఅర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బేనర్‌లో రూపొందనున్న చిత్రం ఈ నెల 12న షూటింగ్ ప్రారంభించుకోనుందని సమాచారం. అయితే ఈ చిత్రం ప్రారంభం ఇంత ఆలస్యం కావడానికి బన్నీయే కారణం అని తెలుస్తోంది. ‘లెజెండ్’ వంటి సూపర్‌హిట్ తర్వాత కూడా బోయపాటికి ఇంత ఆలస్యంగా సినిమా మొదలవ్వడం ఆయన దురదృష్టమే అంటున్నారు. ‘లెజెండ్’ చిత్రంలో నటించిన బాలయ్య కూడా ఆల్‌రెడీ ఇప్పటికే ‘లయన్’ను విడుదల చేసి ‘డిక్టేటర్’కు సిద్దం అవుతుండగా బోయపాటి మాత్రం ఖాళీగా ఉండటం ఆశ్యర్యవేస్తోంది. ఆయన మొదట బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో సినిమా చేయాలనుకున్నాడు. కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం పట్టాలెక్కలేదు. దీంతో వెంటనే ఆయనకు బన్నీతో చాన్స్ వచ్చింది. ఈచిత్రానికి స్టోరీ కుదిరినప్పటికీ అల్లుఅరవింద్ ఈ స్టోరీకి చాలా మార్పులు చేర్పులు చెప్పాడట. అల్లుఅరవింద్ మార్పులు చేసినా కూడా మరలా బన్నీ పిలిచి మరిన్ని మార్పులు చేయించాడని తెలుస్తోంది.