టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘శ్రీమంతుడు’. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నప్పటికీ ఈ చిత్రం బిజినెస్ మాత్రం స్లోగా జరుగుతోంది. నైజాం తప్పించి ముఖ్యంగా వెస్ట్, ఓవర్‌సీస్ బిజినెస్ అసలు ముందుకు కదలడం లేదనేది ట్రేడ్ వర్గాల సమాచారం. దీనికి కారణం మహేష్‌బాబు గత చిత్రాలైన ‘1’ (నేనొక్కడినే), ‘ఆగడు’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గా నిలవడంతో బయ్యర్లు ‘శ్రీమంతుడు’ను తక్కువ రేట్‌కు అడుగుతున్నారు. అయితే నిర్మాతలు మాత్రం రేట్ విషయంలో గట్టిగా ఉన్నారు. తగ్గించడానికి ఒప్పుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం బిజినెస్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందిట. ఈ విషయంలో కాస్త రేటు తగ్గిస్తేనే బిజినెస్ జరుగుతుందని, ఈచిత్రం ఆడియో వేడుక తర్వాత బిజినెస్ విషయంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు నిర్మాతలు, బయ్యర్లు అంటున్నారు.