అచ్చిరాని మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు నాగచైతన్య. ఆయనకు అచ్చిరాని మాస్‌ఇమేజ్ కోసం కలిసి వచ్చిన క్లాస్ హీరో ఇమేజ్‌ను వదలుకుంటున్నాడు. వాస్తవానికి క్లాస్ టచ్ పాత్రలు, లవర్‌బోయ్ క్యారెక్టర్లలో చైతూ ఎప్పుడూ ఫ్లాప్ కాలేదు. సినిమాలు బాగాలేకపోయినా ఆయన నటనకు ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. అయితే ‘బెజవాడ, దడ’లతో చెత్త పేరు తెచ్చుకున్న చైతూ తాజాగా మరోసారి ‘దోచెయ్’తో పరువుపోగొట్టుకున్నాడు. దాంతో ఆయనకు వాస్తవం అర్థమైంది. దీంతో ఆయన తనకు తన కెరీర్‌లో మొదటిహిట్‌ను ఇచ్చిన గౌతమ్ వాసుదేవమీనన్ దర్శకత్వంలో మరోసారి నటిస్తున్నాడు. ఇదో క్యూట్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోంది. ఈ ద్విభాషా చిత్రంలో తెలుగులో చైతూ చేస్తోన్న క్యారెక్టర్‌ను తమిళంలో శింబు చేస్తున్నాడు. ‘ఏమాయ చేసావే’ చిత్రంతో తనకు లవర్‌బోయ్ ఇమేజ్‌ను ఇచ్చి, అదే సినిమా ద్వారా టాప్ హీరోయిన్ సమంతను పరిచయం చేసిన గౌతమ్‌మీనన్ ఈ తాజా చిత్రం ద్వారా మంజిమ్ మోహన్‌ను హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నాడు. ఈ చిత్రంపై చైతూ బోలెడు ఆశలుపెట్టుకొని ఉన్నాడు. గౌతమ్ తనకు రెండో హిట్‌ను కూడా ఇచ్చి తన లవర్‌బోయ్ ఇమేజ్‌ను రెండిరతలు చేస్తాడనే ఆశతో ఉన్నాడట. అంతేగాక ‘ఏమాయచేసావే’ చిత్రంలోని సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ గౌతమ్ ఈ చిత్రంలో అధికబాగాన్ని కేరళలో చిత్రీకరిస్తుండటం విశేషం.