రామ్‌గోపాల్‌వర్మ, పూరీ జగన్నాథ్‌ల బంధం గురుశిష్యుల బంధానికి కొత్త నిర్వచనం చెబుతోంది. పూరీ చిత్రం విడుదలవుతోందంటే చాలు వెంటనే ఆ చిత్రాన్ని వర్మకు చూపిస్తాడు. ఇక వర్మ ఆ చిత్రంపై, పూరీపై ప్రశంసల వర్షం కురిపిస్తాడు. ఇటీవల విడుదలైన ‘టెంపర్’నుండి ఈ పొగడ్తల వర్షం బాగా డోస్ పెరిగింది. తాజాగా ‘జ్యోతిలక్ష్మీ’ని సైతం వర్మ ఆకాశానికి ఎత్తేశాడు. ఇక వర్మ చిత్రాలు విడుదలవుతున్నాయంటే పూరీ పనిగట్టుకొని వర్మ చిత్రాలను ముందుగా చూస్తాడు. తాజాగా ఆయన వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘మొగలిపువ్వు’ చూశాడు. చూసిందే తడవుగా ... ఇలాంటి చిత్రాన్ని మా బాస్ అయితేనే తీయగలరు... ఆయనే గ్రేట్ అంటూ చిత్రానికి ఉచిత పబ్లిసిటీ చేసేశాడు. మొత్తానికి ఈ గురుశిష్యుల బంధాన్ని చూసి మిగిలిన వారు నేర్చుకోవాల్సింది చాలానే ఉంది....!