ఈ ఏడాది సమ్మర్‌లో సినిమాల హడావుడి పెద్దగా కనిపించలేదు. దాంతో సినీ ప్రియులు చాలా వెలితిగా ఫీలవుతున్నారు. కాగా ఈ నెల చివరి వారం నుండి మరలా సినీ జాతర మొదలుకానుంది. జూన్ 26 వ తేదీన 70కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ‘రుద్రమదేవి’ చిత్రం విడుదలకానుంది. ఇక జులై 10న 150కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ‘బాహుబలి’ (ది బిగినింగ్) రిలీజ్‌కు సన్నాహాలు జరుగుతుండగా, జులై 17న మహేష్‌బాబు ‘శ్రీమంతుడు’ విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రం కూడా దాదాపు 50కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఇక రవితేజ ‘కిక్2’ సినిమా కూడా జులైలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని బడ్జెట్ 40కోట్లుగా తెలుస్తోంది. అంటే దాదాపు 40రోజుల వ్యవదిలో 300కోట్లకు సంబంధించిన పైగా పెట్టుబడితో నిర్మితమవుతోన్న చిత్రాల వ్యాపారం జరుగుతోంది. అన్ని అనుకున్న సమయానికి విడుదలైతే దాదాపు 300కోట్ల వ్యాపారం చేస్తోన్న ఈ చిత్రాలన్నీ సినీ ప్రేమికులకు వినోదాన్ని పంచనున్నాయి.