Advertisementt

ఆడియో రిలీజ్‌ ఓకే.. సినిమా రిలీజే డౌటు.!

Wed 10th Jun 2015 07:41 AM
telugu movie srimanthudu,mahesh in srimanthudu,koratala siva,srimanthudu audio on 26th june  ఆడియో రిలీజ్‌ ఓకే.. సినిమా రిలీజే డౌటు.!
ఆడియో రిలీజ్‌ ఓకే.. సినిమా రిలీజే డౌటు.!
Advertisement
Ads by CJ

మహేష్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘శ్రీమంతుడు’ చిత్రం టీజర్‌ ఇటీవల విడుదలై యూ ట్యూబ్‌లో, సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఇక ఈ చిత్రం ఆడియో రిలీజ్‌ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎదురుచూస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ కాంబినేషన్‌లో మహేష్‌ చేసిన రెండో సినిమా ఆడియో కూడా ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చిందని, డెఫినెట్‌గా మహేష్‌ కెరీర్‌లో ఈ ఆడియో పెద్ద హిట్‌ అవుతుందని పాటలు విన్నవారు చెప్తున్నారు. ఈ చిత్రం ఆడియోను ఈనెల 26న చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. అయితే అభిమానుల మధ్య ఆడియోను రిలీజ్‌ చేస్తారా? లేక లిమిటెడ్‌గా ఆహ్వానించిన అతిథులు, మీడియా మధ్య ఫంక్షన్‌ జరుగుతుందా అనేది ఇంకా తెలియాల్సి వుంది. ఆడియో రిలీజ్‌ డేట్‌ అయితే కన్‌ఫర్మ్‌ అయింది కానీ సినిమా రిలీజ్‌ విషయంలోనే ఇంకా కన్‌ఫ్యూజన్‌ కొనసాగుతోంది. మొదట ఈ సినిమాను జూలై 17న రిలీజ్‌ చేస్తారని తెలిసింది. అయితే మహేష్‌ బర్త్‌డే ఆగస్ట్‌ 9 ఆ డేట్‌కి రిలీజ్‌ చేస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆగస్ట్‌ 9 ఆదివారం కావడంతో రిలీజ్‌కి అనువైన డేట్‌ కాదని భావించిన దర్శకనిర్మాతలు ఆగస్ట్‌ 7 ‘శ్రీమంతుడు’ రిలీజ్‌ డేట్‌గా కన్‌ఫర్మ్‌ చేసినట్టు తెలుస్తోంది. అయితే జూలై 17, ఆగస్ట్‌ 7 ఈ రెండు డేట్స్‌లో ఏదీ అఫీషియల్‌గా కన్‌ఫర్మ్‌ చెయ్యకపోవడంతో సినిమా రిలీజ్‌ ఎప్పుడు అనేది ఇంకా డౌట్‌గానే వుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ