సూపర్ చిత్రంతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైన అనుష్క ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించినప్పటికీ ‘అరుంధతి’ చిత్రంతోనే ఆమెకు గుర్తింపు వచ్చింది. ఆ చిత్రం తర్వాత మళ్ళీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో తన అందాలను ఆరబోసి చాలా సినిమాలు చేసినా, ఆ సినిమాలు సూపర్‌హిట్ అయినా ఆమెకు ఊహించినంత పేరు రాలేదు. ఈమధ్య తమిళ్‌లో రజనీకాంత్‌తో చేసిన ‘లింగ’ విజయవంతం కాకపోవడం, అజిత్‌తో చేసిన ‘ఎన్నయ్ అరిందాల్’(ఎంతవాడుగానీ) సూపర్‌హిట్ అయినప్పటికీ ఆ చిత్రంలో అంత ప్రాధాన్యతలేని క్యారెక్టర్ చెయ్యడం వల్ల అది కూడా ఆమెకు పేరు తెచ్చిపెట్టలేదు. అయితే ఇక ఆమె ఆశలన్నీ రెండు చిత్రాలపైనే పెట్టుకుంది. ఒకటి గుణశేఖర్ ‘రుద్రమదేవి’, రెండు రాజమౌళి ‘బాహుబలి’. రుద్రమదేవి ఈనెల 26న విడుదలవుతుండగా, బాహుబలి జూలై 10న రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఈ రెండు సినిమాల ఫలితాలు తన కెరీర్‌ని డిసైడ్ చేస్తాయని అనుష్క గట్టిగా నమ్ముతోంది. ఈ రెండు సినిమాల కోసం ఈమధ్యకాలంలో ఏ హీరోయినూ పడని కష్టం పడిరది. ఈ రెండు సినిమాలు కంప్లీట్ చేసి ప్రస్తుతం సైజ్ జీరో చిత్రం చేస్తున్న అనుష్క ఆ సినిమా కంటే ఈ రెండు సినిమాలపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఆమె ఆశ ఎంత వరకు నెరవేరుతుందో, ఆమె కెరీర్ ఎలాంటి టర్నింగ్ తీసుకుంటుందో వెయిట్ అండ్ సీ.