జూనియర్ ఆర్టిస్ట్‌గా పరిచయమై ఆ తర్వాత కొన్ని క్యారెక్టర్స్ చేసి అందర్నీ మెప్పించిన ఆర్.నారాయణమూర్తి ‘అర్థరాత్రి స్వతంత్రం’ చిత్రంతో కథానాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా మారాడు. తన మొదటి చిత్రంతోనే తనలోని ఆవేశాన్ని, ఆలోచనని ప్రేక్షకులకు రుచి చూపించి ఆ తర్వాత తన పంథా మార్చుకోకుండా విప్లవాత్మక చిత్రాలు నిర్మిస్తూ, సమకాలీన సమస్యలతో సినిమాలు తీస్తూ ప్రజల్లో చైతన్యాన్ని తెచ్చేందుకు గత 30 సంవత్సరాలుగా కృషి చేస్తున్న ఆర్.నారాయణమూర్తి ఇప్పుడు మరో విప్లవాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తన సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా వెరవని నారాయణమూర్తి ‘దండకారణ్యం’ పేరుతో మరో పవర్‌ఫుల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో, ఎక్కడ షూటింగ్ చేస్తున్నాడో తెలీకుండా ఒక్కసారిగా పబ్లిసిటీతో ప్రేక్షకుల ముందుకు వచ్చే నారాయణమూర్తి ఈ చిత్రాన్ని కూడా అదే పద్ధతిలో చేస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలుస్తాయి.