‘రేయ్, పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రాలలో నటించిన మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్ ప్రస్తుతం దిల్‌రాజు బేనర్‌లో హరీష్‌శంకర్ దర్శకునిగా ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రంలో కూడా దిల్‌రాజు పార్ట్‌నర్ అన్న సంగతి తెలిసిందే. కాగా ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ చిత్రం విడుదలైన వెంటనే దిల్‌రాజు సాయిధరమ్‌తేజ్‌తో మూడో చిత్రం నిర్మించడానికి సిద్దమైపోతున్నాడు. ఈ చిత్రానికి ‘శతమానం భవతి’ అనే టైటిల్‌ను పెట్టనున్నట్లు సమాచారం. సాయి తప్ప మిగతా అందరినీ కొత్తవారిని తీసుకొని దిల్‌రాజు నిర్మించే ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు? అనేది మాత్రం తెలియరావడం లేదు.