టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా, శృతిహాసన్ హీరోయిన్‌గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘శ్రీమంతుడు’. కాగా ఈ చిత్రాన్ని జులై 17న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రం గురించి కొన్ని విషయాలను ఈ చిత్ర కెమెరామెన్ మది తమిళ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాధానమిచ్చాడు. ఆయన మాట్లాడుతూ... ‘శ్రీమంతుడు’ చిత్రం సోషల్ మెసేజ్‌తో కలిసిన యాక్షన్ ఎంటర్‌టైనర్. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో మల్టీమిలియనీర్ అయిన మహేష్ ఓ గ్రామాన్ని దత్తత చేసుకొని అక్కడి సమస్యలను ఎలా పరిష్కరిచాడు.. అన్న దిశగా కథ నడుస్తుందని మది చెప్పుకొచ్చాడు.