ఇండియాలోనే అతి పెద్ద మూవీగా రూపొందుతూ.. బడ్జెట్‌పరంగానే కాదు... గ్రాఫిక్స్ పరంగా కూడా ఇదే అతి పెద్ద మూవీగా ‘బాహుబలి’ని చెప్పవచ్చు. కాగా ఈ చిత్రం ట్రైలర్ చూసిన వారితో పాటు యూనిట్ సభ్యులు కూడా ఈ చిత్రంలోని పలు విభాగాలకు అవార్డులు ఖాయం అంటున్నారు. ఈ విషయమై హీరో ప్రభాస్ స్పందిస్తూ... ఈ సినిమాకు సంబంధించి అవార్డులు ఎవరికి వచ్చినా రాకపోయినా.. ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులకు మాత్రం పురస్కారాలు లభిస్తాయి.... ఆర్ట్ డైరెక్టర్ సాబుసిరిల్‌తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ టీంకు అవార్డులు తప్పకుండా వస్తాయి. దీనితో పాటు పలు విభాగాలకు జాతీయ అవార్డుల ఖాయమని ఆయన తెలిపారు.