ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూమి పూజకు పవన్‌కల్యాణ్ హాజరుకాకపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో రాజధాని శంఖుస్థాపనకు కచ్చితంగా తాను హాజరవుతానని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రాజధాని కోసం రైతులనుంచి బలవంతంగా భూమి లాక్కుంటున్నందుకే ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేదన్న వార్తలు వినిపించాయి. మరోవైపు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని పవన్‌కు అసలు పిలుపే వెళ్లలేదన్న చర్చలు కూడా కొనసాగాయి. అయితే ఈ వార్తలపై టీడీపీ నాయకులు స్పందించారు.
మీడియాలో వస్తున్నట్లు పవన్ కల్యాణ్ భూమిపూజకు హాజరు కాకపోవడానికి వేరే ఏ కారణాలు లేవని వారు చెప్పుకొచ్చారు. గబ్బర్‌సింగ్-2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్లే పవన్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని వారు చెబుతున్నారు. పవన్, బాబుల మధ్య ఎలాంటి విబేధాలు లేవని, రాష్ట్ర అభివృద్ధికోసం వారిద్దరూ కలిసి పనిచేస్తారని వారు ప్రకటించారు. మరి ఈ ప్రకటనలో నిజానిజాలు దెవుడెకెరుక.