పూరి జగన్నాథ్‌కి చిత్ర పరిశ్రమలో ఒక్కరే బాస్. ఆయనే... రామ్‌గోపాల్ వర్మ. తన గురువు వర్మగారు అని చెప్పుకోవడానికి గర్వపడతా అంటుంటారు పూరి. జీవితాన్ని చూసే కోణంలోనూ, సినిమా తీసే విధానంలోనూ వర్మనే ఫాలో అవుతుంటారు పూరి. ముఖ్యంగా అనుకొన్న బడ్జెట్లో, వేగంగా సినిమా తీయడం పూరికి వర్మ నుంచే అబ్బిన గుణమే అని చెబుతుంటారు. పూరి ఏ సినిమా తీసినా వర్మ ఆకాశానికెత్తుస్తుంటాడు. మొన్నటికి మొన్న పూరి తీసిన `టెంపర్`ని భలే ఇదిగా ప్రమోట్ చేశాడు వర్మ. ఇప్పుడు వర్మ తీసిన సినిమాని కూడా ప్రమోట్ చేసే పనిలో ఉన్నాడు పూరి. రామ్‌గోపాల్ వర్మ ఇటీవల `సీక్రెట్` అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. తెలుగులో ఆ చిత్రం `మొగలిపువ్వు`గా తెరకెక్కింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందులోని 40 నిమిషాల ఫుటేజ్ చూశాననీ, సినిమా అదిరిపోయిందనీ పూరి ట్వీట్