Advertisementt

అనుష్క కెరీర్‌లో బెస్ట్‌ క్యారెక్టర్‌ ఏమిటి..?

Sat 06th Jun 2015 04:36 AM
anushka,bahubali,prabhas,rajamouli,rudhramadevi  అనుష్క కెరీర్‌లో బెస్ట్‌ క్యారెక్టర్‌ ఏమిటి..?
అనుష్క కెరీర్‌లో బెస్ట్‌ క్యారెక్టర్‌ ఏమిటి..?
Advertisement
Ads by CJ
ప్రభాస్‌తో నేను చేసిన మూడో చిత్రం ‘బాహుబలి’. మా ఇద్దరి మధ్య ఎంత అవగాహన ఉంటుందో, మేము సెట్‌లో ఒకరికొకరు ఎలా సహకరించుకుంటామో, ఆ ఫలితం ఎలా ఉంటుందో ‘బాహుబలి’ చూస్తే అర్థం అవుతుంది అంటూ చెప్పుకొచ్చింది అనుష్క.అలాగే 
రాజమౌళిగారితో  రెండో సినిమా చేయడం ఎంతో ఆనందాన్నిచ్చిందని.. ఈ సినిమా చేయడానికి కారణం ఒకటి రాజమౌళి గారైతే, మరొకటి ‘భాహుబలి’ స్క్రిప్ట్‌ అని అన్నారామె. ‘రుద్రమదేవి’లో రాణి రుద్రమదేవిగా నటించడంతో పాటు త్వరలోనే ‘బాహుబలి’ చిత్రంలో దేవసేనగా ఈమె పలకరించబోతోంది. ఈమధ్య నన్ను చాలామంది ఒక ప్రశ్న అడుగుతున్నారు. ‘అరుంధతి, రుద్రమదేవి, దేవసేన’... ఈమూడు పాత్రల్లో మీకు ఏది ఎక్కువగా ఇష్టం అని ప్రశ్నిస్తున్నారు. నేనైతే మొదటి సినిమాలోని క్యారెక్టర్‌ (అరుంధతి) పాత్రకే ఓటేస్తాను. ఎందుకంటే ఆ సమయంలో నాకు ఏమి తెలియదు. అంత క్లిష్టమైన పాత్రని ధైర్యంగా చేసి ప్రేక్షకులను మెప్పించగలిగాను. అందుకే ఆ సినిమా నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.. అంటూ చెప్పుకొచ్చింది అనుష్క. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ