మహేష్‌బాబు హీరోగా మైత్రి మూవీస్ పతాకంపై కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘శ్రీమంతుడు’. ఇందులో మహేష్‌కు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ చిత్రం ఆడియో వేడుకను ఈనెల 27న రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. కాగా ఈ చిత్రంలోని పాటలకు దేవిశ్రీ అద్బుమైన ట్యూన్స్ ఇచ్చాడని సమాచారం. కాగా ఈ చిత్రంతో పాటు ఆడియో కూడా సంచలన విజయం సాధించడం ఖాయమనే విశ్వాసంతో మహేష్‌బాబు అభిమానులు ఉన్నారు. మరి ఈ ఆడియో వేడుకకు వేదిక ఎక్కడ? అభిమానుల సమక్షంలోనే చేస్తారా? లేదా? అన్న విషయాలు త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారు.