Advertisementt

ద్విభాషా చిత్రాలపై పెరుగుతున్న మోజు..!

Fri 05th Jun 2015 08:42 AM
bahubali,rajamouli,kamal,cheekati rajyam,brahmothsawam  ద్విభాషా చిత్రాలపై పెరుగుతున్న మోజు..!
ద్విభాషా చిత్రాలపై పెరుగుతున్న మోజు..!
Advertisement

సాధారణంగా ఇంతకాలం తమిళ నటులు తెలుగులో మంచి మార్కెట్‌ తెచ్చుకున్నారే కానీ తెలుగు హీరోలు ఆ దిశగా పెద్ద ప్రయత్నం చేయలేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు మాత్రం మన హీరోలు ద్విభాషా చిత్రాలపై ముఖ్యంగా తమిళంపై తమ దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ఇప్పటికే ‘ బాహుబలి’చిత్రం తమిళంలో కూడా రూపొందుతోంది. దీనికి అనుగుణంగానే  దర్శకుడు రాజమౌళి తమిళంలో కూడా మంచి గుర్తింపు ఉన్న నటీనటులను ఈ చిత్రానికి ఎంపిక చేసుకున్నాడు. అనుష్క, తమన్నా, రానా, సత్యరాజ్‌, రమ్యకృష్ణ, నాజర్‌ వంటి వారికి కీలకపాత్రలను ఇచ్చాడు. కాగా మహేషబాబు తాజాగా నటించనున్న ‘బ్రహ్మోత్సవం’ కూడా తెలుగుతో పాటు తమిళంలో కూడా రూపొందుతోంది. నాగార్జున`కార్తి`తమన్నాలతో వంశీపైడిపల్లి  తెరకెక్కిస్తున్న చిత్రం కూడా ద్విభాషా చిత్రమే. ఇక అనుష్క, ఆర్యలు జంటగా రూపొందుతోన్న ‘సైజ్‌జీరో’ , నాగచైతన్య `చందు మొండేటి చిత్రం కూడా ద్విభాషా చిత్రమే. ఇక తమిళంలో కూడా ఈ ట్రెండ్‌ మరలా ఊపందుకొంది. సూర్య నటిస్తున్న ‘24’, ‘ఈనాడు’ తర్వాత కమల్‌హాసన్‌ ‘చీకటిరాజ్యం’తో...ఎనిమిదేళ్ల తర్వాత రజనీకాంత్‌  రంజిత్‌ సినిమాతో మరలా తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement