Advertisementt

రజనీ సరసన ఎవరు..!

Fri 05th Jun 2015 08:25 AM
rajinikanth,kocchadayan,linga,ranjith,vidhyabalan  రజనీ సరసన ఎవరు..!
రజనీ సరసన ఎవరు..!
Advertisement
Ads by CJ
‘కొచ్చాడయాన్‌, లింగ’ చిత్రాలతో వరుసగా రెండు డిజాస్టర్‌ రుచి చూసిన సౌత్‌ ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం రంజిత్‌ దర్శకత్వంలో కలైపులిథాను నిర్మిస్తున్న చిత్రం ఆగష్టు 1వ తేదీ నుండి రెగ్యులర్‌ షూటింగ్‌కు రెడీ అవుతోంది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్‌ హీరోయిన్‌ విద్యాబాలన్‌ను తీసుకోవాలని భావిస్తున్నారట. ‘కొచ్చాడయాన్‌’లో దీపికాపడుకొనేతో రొమాన్స్‌ చేసిన రజనీ ఆ తర్వాత ‘లింగ’చిత్రంలో మరో బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనాక్షిసిన్హాతో  కలిసి నటించాడు. దాంతో తన తాజా చిత్రంలో ఆయన విద్యాబాలన్‌తో కలసి నటించడం దాదాపు ఖాయమనే వార్తలు వస్తున్నాయి. కానీ కొందరు మాత్రం రజనీ తాజా చిత్రంలో ఫిమేల్‌ పాత్రలు ఉంటాయే గానీ రజనీకి హీరోయిన్‌ మాత్రం ఉండదని అంటున్నారు. 
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ