Advertisementt

'మగధీర'కు అడుగడుగునా ఆటంకాలు..!!

Thu 04th Jun 2015 08:53 AM
karan johar,magha deera,bollywoodremake,shuddhi  'మగధీర'కు అడుగడుగునా ఆటంకాలు..!!
'మగధీర'కు అడుగడుగునా ఆటంకాలు..!!
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌ దర్శక-నిర్మాత కరణ్‌జోహర్‌కు మంచి అభిరుచి ఉన్న వ్యక్తిగా పేరుంది. ఆయన తీసిన సినిమాలు కూడా బాలీవుడ్‌లో బ్లాక్‌బాస్టర్‌గా నిలిచాయి. అయితే ఆయన తీస్తానన్న ఓ సినిమా గురించి ఇప్పుడు కరణ్‌ కదిలిస్తే కస్సుబుస్సుమంటున్నాడు.

కరణ్‌జోహర్‌ దర్శకత్వంలో నటించే అవకాశాన్ని సాధారణంగా ఏ నటుడు వదులుకోడు. అయితే తెలుగులో సూపర్‌హిట్‌ అయిన 'మగధీర' కథాంశంతో 'శుద్ధి' సినిమా తీయాలని కరణ్‌ భావించారు. అయితే ఏ క్షణాన ఈ సినిమా గురించి ప్రకటించారరో తెలియదు కాని.. ఈ సినిమాకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. మొదట ఈ సినిమాలో హృతిక్‌ రోషన్‌, కరీనా కపూర్‌లు నటిస్తారని ప్రకటించారు. ఆ తర్వాత వారిద్దరూ తప్పుకున్నారు. దీంతో ఓ సమయంలో ఖాన్‌ల త్రయం పేరు కూడా వినిపించింది. ఆ తర్వాత వరుణ్‌ ధావన్‌, ఆలియా భట్‌ల పేరు కూడా వినిపించింది. అయినా సినిమా షూటింగ్‌ మొదలవడం లేదు. ఇక ఈ సినిమా గురించికదిలిస్తే చాలు కరణ్‌ కస్సుబుస్సుమంటుండటంతో ఈ ప్రాజెక్టు ఉందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ