మహేష్‌బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం’. కాగా మహేష్‌బాబు నాలుగేళ్ల క్రితమే ఓ తమిళ స్ట్రెయిట్ చిత్రంలో నటించాల్సివుంది. కానీ అది అప్పుడు వర్కౌట్ కాలేదు. తాజాగా మహేష్ తమిళంలో సినిమా చేయడం కోలీవుడ్‌లో హాట్‌టాపిక్ అయింది. అది మరేదో కాదు.. బ్రహ్మోత్సవమే. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం మహేష్ నటించిన తొలి తమిళ చిత్రంగా నిలువనుంది. కాగా ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్‌తో పాటు ప్రణీత కూడా నటించనుంది. ‘అమ్మో.. బాపు గారి బొమ్మో.. ’ అంటూ పవన్ చేత పొగిడిరచుకున్న ఈ అమ్మడుకు ఇది అనుకోని వరం అనే చెప్పుకోవాలి. మొన్న పవన్‌తో నటించిన ఆమె ఇప్పుడు మహేష్ సరసన నటించనుండటం విశేషం. ఆమె చేసేది సెకండ్ హీరోయిన్ వేషమే అయినా ఇది ఆమె కెరీర్‌కు పెద్ద ప్లస్ పాయింట్ కానుంది.