వావ్.. భారతీయ సినిమా గర్వపడేలా చేసినందుకు థాంక్స్... హ్యాట్సాఫ్ టు ‘బాహుబలి’ టీం.. అంటూ ట్వీట్ చేసి అభినందనలు తెలియజేశాడు తమిళ స్టార్ సూర్య. ‘బాహుబలి’ ట్రైలర్ ఇటీవలే తమిళంలో కూడా రిలీజైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తన మనసులోని మాటను ఇలా ట్వీట్ చేసి బయటపెట్టాడు. కాగా వివాదాస్పద దర్శకుడు వర్మ ‘బాహుబలి’గురించి ట్వీట్ చేశాడు. సహజంగా వర్మ కామెంట్లలో కాస్త ‘అతి’ కనిపిస్తుంది. పొగిడితే ఆకాశానికి ఎత్తేస్తాడు. నీ అంత మొనగాడు లేడంటాడు. అంతెందుకు సంపూని సూపర్‌స్టార్లతో పోల్చి వాళ్ల పరువుతీశాడు. ఏ సినిమా వచ్చినా, ఫస్ట్‌లుక్ రిలీజైన తనదైన శైలిలో కామెంట్లు పెట్టి ఆకర్షిస్తాడు. ఈయన ‘బాహుబలి’ట్రైలర్ చూసి ట్వీట్ చేస్తూ... అంతర్జాతీయస్థాయి సినిమాలతో పోలిస్తే ‘బాహుబలి’కి 100కు 70 మార్కులు వేస్తాను. అదే ఇండియన్ స్కేల్ మీద అయితే 100కి 500మార్కులు వేస్తాను. ఈ సినిమా తన దృష్టిలో తాజ్‌మహల్ వంటిదని వర్మ ట్వీట్ చేశాడు.