ఊహలు గుసగుసలాడే, జోరు, జిల్’ వంటి చిత్రాల ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకున్న ముద్దుగుమ్మ రాశిఖన్నాకు ఇటీవల ఓ చేదు అనుభవం జరిగింది. ఆమెను నెల్లూరులోని లాట్ మొబైల్స్ వారి షాప్‌కు అతిథిగా వచ్చేందుకు సమ్మతించింది. హైదరాబాద్ నుండి రేణిగుంటలో దిగి అక్కడి నుండి రోడ్డు మార్గంలో నెల్లూరుకు రావడానికి కారును షాప్ యాజమాన్యం అరేంజ్ చేసింది. అయితే డ్రైవర్ కన్‌ఫ్యూజ్ అయి నెల్లూరు బదులు ఆమెను వేలూరుకు తీసుకొని వెళ్లాడు. దాంతో షాపు నిర్వాహకులకు టెన్షన్ మొదలైంది. రాశిఖన్నా మిస్ అయిన సంగతి అక్కడి లోకల్ మీడియాకు లీక్ కావడంతో ఈ విషయం దాచాలని ప్రయత్నించిన నిర్వాహకులకు అది సాధ్యం కాలేదు. విషయం బయటకు పొక్కింది. 11.45కు నెల్లూరు రావాల్సిన ఆమె 2గంటలకు చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.