Advertisementt

తమిళంలో మహేష్‌ అరంగేట్రం..!!

Wed 03rd Jun 2015 02:09 AM
  తమిళంలో మహేష్‌ అరంగేట్రం..!!
తమిళంలో మహేష్‌ అరంగేట్రం..!!
Advertisement
Ads by CJ

మహేష్‌బాబు కథానాయకుడిగా నటించనున్న తాజా చిత్రం 'బ్రహ్మూెత్సవం'. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లకముందే పలు విశేషాలకు వేదికగా నిలుస్తోంది. మొదటిసారిగా మహేష్‌బాబు ఈ చిత్రంతో ప్రొడ్యూసర్‌గా మారబోతున్నారు. ఎమ్‌బీ(మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్‌) పతాకంపై పీవీపీ సంస్థతో కలిసి మహేష్‌ ఈ సినిమా నిర్మించనున్నారు. అంతేకాకుండా ఒకేసారి ఈ సినిమాను తెలుగు, తమిళ్‌ భాషల్లో తెరకెక్కిస్తుండటం గమనార్హం. కుటుంబ అనుబంధాల వేదికగా నిలవనున్న ఈ చిత్రంలో మహేష్‌బాబు సరసన రకుల్‌ప్రీత్‌సింగ్‌, ప్రణీత కథానాయికలుగా నటించనున్నట్లు సమాచారం. జూలై 10 నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవనుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ