Advertisementt

చాలా సీక్రెట్‌గా వస్తున్నాడు.!

Wed 03rd Jun 2015 01:46 AM
telugu movie asura,nara rohit in asura,asura movie on 5th june  చాలా సీక్రెట్‌గా వస్తున్నాడు.!
చాలా సీక్రెట్‌గా వస్తున్నాడు.!
Advertisement
Ads by CJ

నారా రోహిత్‌ ఇప్పటివరకు హీరోగా చేసిన సినిమాలే కొన్ని. అందులో బాణం, సోలో చెప్పుకోదగిన సినిమాలు. ఆమధ్య వచ్చిన ‘రౌడీఫెలో’ సినిమా పరంగా ఓకే అనిపించినా కమర్షియల్‌గా సక్సెస్‌ అవ్వలేదు. ఆ సినిమాకి రిలీజ్‌ ముందు, రిలీజ్‌ తర్వాత చాలా పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేశారు. అలా చేసినా ఆ సినిమా ఓకే అనిపించుకుంది తప్ప కమర్షియల్‌ హిట్‌ అవ్వలేదు. ఇప్పుడు లేటెస్ట్‌గా కృష్ణ విజయ్‌ దర్శకత్వంలో రోహిత్‌ చేసిన ‘అసుర’ విషయానికి వస్తే సరైన పబ్లిసిటీ లేకుండా రిలీజ్‌ చేస్తున్నారు. ఆడియో ఫంక్షన్‌కి ముందు ఈ సినిమాకి ఎలాంటి పబ్లిసిటీ లేదు. ఆడియో రిలీజ్‌ అయిన తర్వాత మీడియాలో సినిమా గురించి ఎక్కడా ఒక్క వార్త కూడా రాలేదు. పబ్లిసిటీలో ఇంత వెనుకపడిన ఈ సినిమాని జూన్‌ 5న విడుదల చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాని చాలా సీక్రెట్‌గా చేస్తున్నట్టుగా వుంది. నారా రోహిత్‌ సినిమా అంటేనే ఓపెనింగ్స్‌ అంతంత మాత్రంగా వుంటాయి. సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతోందో ఆడియన్స్‌కి సరిగ్గా తెలీనపుడు వచ్చే ఓపెనింగ్స్‌ కూడా బాగా డ్రాప్‌ అయ్యే అవకాశం వుంది. ఇంత సీక్రెట్‌గా ‘అసుర’ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్న నిర్మాతలు సినిమాని ఎలా ప్రమోట్‌ చేసుకుంటారో చూడాలి మరి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ