Advertisementt

దిల్‌రాజుకు పూర్వవైభవం తెస్తుందా...?

Tue 02nd Jun 2015 07:53 AM
dil raju,kerintha movie,sumanth aswin,sreedivya,tejaswi  దిల్‌రాజుకు పూర్వవైభవం తెస్తుందా...?
దిల్‌రాజుకు పూర్వవైభవం తెస్తుందా...?
Advertisement
Ads by CJ

నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా దిల్‌రాజు అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు. ఇందులో భారీ బడ్జెట్‌, స్టార్‌ హీరోలతోచేసిన చిత్రాలే ఉన్నప్పటికీ ఆయనకు పేరును తీసుకువచ్చింది మాత్రం ‘కొత్తబంగారులోకం, బొమ్మరిల్లు’ వంటి చిన్న చిత్రాల వల్లే...  కాగా చాలాకాలం తర్వాత మరలా ఆయన ఓ చిన్న చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సుమంత్‌ అశ్విన్‌, శ్రీదివ్య, తేజస్వీ వంటి వారితో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బేనర్‌లో అడవి కిరణ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కేరింత’ చిత్రం మరలా తనకు పెద్ద విజయాన్ని అందించి ప్రశంసలతో పాటు మంచి ఆర్థిక లాభాలను కూడా అందిస్తుందనే ఆశతో ఉన్నాడు. కాగా ఈ చిత్రాన్ని జూన్‌ 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఆయనకు, ఆయన బేనర్‌కు ఎలాంటి పేరును తెస్తుందో వేచిచూడాల్సివుంది...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ