తెలుగులో టాప్‌హీరోయిన్ల పోటీలో ముందున్న సమంత, శృతిహాసన్‌లు కోలీవుడ్‌పై దృష్టిపెట్టడం, కాజల్ జాడ కనిపించకపోవడం వంటి అంశాలు తాజాగా తమన్నాకు వరంగా మారాయి. ఇక్కడ ఆమె కేవలం రకుల్‌ప్రీత్‌సింగ్ హవాను కాస్త అడ్డుకుంటే చాలు... చక్రం తిప్పే అవకాశాలు పుష్కళంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆమె రాజమౌళి`ప్రబాస్‌ల ‘బాహుబలి’, రవితేజ ‘బెంగాల్‌టైగర్’ చిత్రాల్లో నటిస్తోంది. కాగా పివిపి సంస్థ నాగార్జున , కార్తీలు హీరోలుగా తెలుగు, తమిళ భాషల్లో వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కూడా తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. వాస్తవానికి శృతిహాసన్ చేయలేకపోవడం వల్లే ఈ సినిమాలో తమన్నాకు చాన్స్ వచ్చింది. ఇలాంటి అవకాశాలు ఆమెకు పుష్కళంగానే లభించనున్నాయి. మరి వాటిని ఆమె ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటుంది? రకుల్ హవాను ఎలా ఎదుర్కొంటుంది? అనే అంశాలపైనే ఆమె భవిష్యత్తు ఆధారపడివుంది.