‘టెంపర్’ విజయంతో ఊపుమీదన్న ఎన్టీఆర్‌తో ఆ వెంటనే సుకుమార్ దర్శకత్వంలో చిత్రాన్ని నిర్మించేందుకు భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్‌తో పాటు రిలయన్స్ కూడా రెడీ అయింది. ఎప్పుడో లండన్‌లో ప్రారంభం కావాల్సిన ఈ చిత్రం ఇప్పటికీ పట్టాలెక్కకపోవడానికి కారణం ఏమిటి? అనే చర్చ ఫిల్మ్‌నగర్‌లో జరుగుతోంది. ఈ చిత్రంలో న్యూలుక్ కోసం ఎన్టీఆర్ మేకోవర్‌పై దృష్టిపెట్టి గడ్డం పెంచుతుండటం, బాడీలాంగ్వేజ్, డైలాగ్ డెలివరీలపై కూడా ప్రత్యేక శ్రద్ద పెడుతున్న కారణంగా ఈ చిత్రం మొదలుకావడానికి ఆలస్యం అవుతోంది. మరో పక్క సినిమాలో ఎక్కువ భాగాన్ని లండన్‌తో పాటు బ్రిటన్‌కు సంబంధించిన పలు లొకేషన్లను వెతికే క్రమంలో ఆలస్యం జరగడం, వీసాల సమస్య కూడా ఎదురుకావడం, ఇక ‘దోచెయ్’ ఫ్లాప్ తర్వాత కాస్త సర్ధుకోవడానికి నిర్మాతకు కొంత సమయం పట్టడం వంటి పలు కారణాలు ఈ సినిమా ఆలస్యానికి కారణంగా మారాయని సమాచారం. మొత్తానికి ఈ చిత్రం జూన్ రెండో వారంలో లండన్‌లో షూటింగ్‌ను ప్రారంభించుకోనుంది. సుకుమార్ తన స్క్రిప్ట్‌నుపక్కాగా రాసుకోవడం, ఆల్‌రెడీ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి కావాల్సిన ట్యూన్స్‌ను రెడీ చేసేసి ఉండటంతో ఈ చిత్రం ఒక్కసారి పట్టాలెక్కితే దూసుకుపోవడం ఖాయం అని చెప్పవచ్చు.