దేవుడు పిలిచి మరీ వరం ఇవ్వడం అంటే ఇదే. ఎందుకంటే మహేష్‌బాబు తన ‘శ్రీమంతుడు’ చిత్రం విషయంతో పాటు టీజర్ లాంఛ్, ట్రైలర్ రిలీజ్, ‘బ్రహ్మోత్సవం’ ప్రారంభోత్సవం వంటి పలు కార్యక్రమాలను తన తండ్రి కృష్ణ పుట్టినరోజైన మే 31న ప్లాన్ చేసుకున్నాడు. ఇంతలో ‘బాహుబలి’ ఆడియో రిలీజ్ కూడా 31వ తేదీనే అనే విషయం ఖరారు కావడంతో ‘బాహుబలి’ సెగ సూపర్‌స్టార్ మహేష్‌బాబును కూడా తాకనుందని అనిపించింది. అయితే అనివార్య పరిస్థితుల్లో ‘బాహుబలి’ ఆడియో వేడుక వాయిదా పడటంతో మహేష్‌కు కాస్త ఊరట లభించింది. పనిలో పనిగా మహేష్ ప్రేక్షకాభిమానుల అటెన్షన్‌ను మరలా తనవైపు తిప్పుకోగలిగాడు. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా మహేష్ రాజమౌళికి థాంక్స్ చెప్పుకోవడమే సరైనదనే సెటైర్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి ‘శ్రీమంతుడు’ చిత్రం ఫస్ట్‌లుక్ అందరి కంటే మరీ ముఖ్యంగా మహేష్ వీరాభిమానుల కంటే మహేష్ బావ గల్లా జయదేవ్‌కే ఎక్కువ సంతోషం కలిగించి ఉంటుంది. ఎందుకంటే మహేష్‌బాబు తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్లైన సైకిల్ ఎక్కి ఫోజువ్విడం ద్వారా భవిష్యత్తులో మహేష్‌ను వాడుకోవాల్సివస్తే ఈ సైకిల్‌పైకి ఎక్కిన స్టిల్ అయితేనే పర్‌ఫెక్ట్‌గా సూటవుతుందని అంటున్నారు.