మొత్తం మీద చిరంజీవి రీఎంట్రీ మూవీగా తెరకెక్కనున్న ఆయన నటించే 150వ చిత్రానికి దర్శకుడు పూరీజగన్నాథ్ ఖాయమయ్యాడు. ఈ ఒక్క విషయంలో తప్ప మిగిలిన చాలా విషయాలపై క్లారిటీ రావాల్సివుంది. చిరంజీవికి జోడీగా ఎవరు నటించనున్నారు? సంగీతం ఎవరి చేతికి వెళ్లుతుంది? అనే విషయాలపై క్లారిటీ రావాల్సివుంది. తాజా సమాచారం ప్రకారం చిరుకు జోడీగా నయనతార నటించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ తమిళంలో యంగ్ హీరోలతోపాటు సీనియర్ హీరోల సరసన కూడా నటిస్తోన్న నయనతార ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న సీనియర్ స్టార్స్ అయినా నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి వారి సరసన నటించింది. యంగ్ హీరోలైన ఎన్టీఆర్, ప్రబాస్ లాంటి వారితో కూడా .జత కట్టింది. సో.. చివరకు ఆమెనే ఫైనల్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇక సంగీత దర్శకుల విషయంలో యంగ్‌తరంగ్ దేవిశ్రీప్రసాద్‌తో పాటు తమిళ సంగీత సంచలనం అనిరుధ్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. తాజాగా యువ సంగీత దర్శకుడు గిబ్రాన్ అయితే ఎలా ఉంటుంది? పోనీ సీనియర్ ఛాయిస్‌గా మణిశర్మ అయితే ఎలా ఉంటుంది? అనే విధంగా కూడా ఆలోచనలు సాగుతున్నట్లు సమాచారం. మొత్తానికి మరో రెండు నెలల్లో పట్టాలెక్కనున్న ఈ చిత్రంలో చివరకు ఎన్ని మార్పులు చేర్పులు జరుగుతాయో ఇప్పుడే చెప్పలేం అంటున్నారు ఫిల్మ్‌నగర్ వాసులు....!