సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. ఆయన సినిమాలో కంటెంట్ లేకపోయిన ఓపెనింగ్స్ మాత్రం భారీస్థాయిలో వచ్చేలా వర్మ ప్లాన్ చేసుకునేవాడు. ఇక వరుసపెట్టి వర్మ చెత్త సినిమాలు తీస్తుండటంతో బాలీవుడ్ ప్రేక్షకులు ఆయన సినిమాలకు రావడమే మానేశారు. దీంతో వర్మ తన దృష్టిని టాలీవుడ్‌పైకి మరల్చి టైంపాస్ సినిమాలు చేస్తూ కాలంగడిపాడు. ఈ టైంపాస్ సినిమాలకు కూడా తెలుగులో ఓపెనింగ్స్ భారీగానే ఉండటంతో అవి కాస్ట్‌ఫెయిల్యూర్ అయ్యేవి కావు. ఇక ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు కూడా ఆయన్ను పట్టించుకోవడం మానేసినట్లు కనిపిస్తోంది
వర్మ గతంలో ఎన్నడూ లేనివధంగా '365 డేస్' సినిమా గురించి పబ్లిసిటీ చేశాడు. ఇష్టం ఉంటే తన సినిమా చూడండి లేకపోతే లేదు అని మాట్లాడే ఈ దర్శకుడు మొదటిసారి '365 డేస్' సినిమాను అందరూ చూడాలంటూ పిలుపునిచ్చాడు. అయితే ఈ పిలుపు తెలుగు ప్రేక్షకులకు వినబడనట్టుంది. ఈ సినిమా వచ్చి వారమైనా ఇండస్ట్రీలో ఎలాంటి టాక్ లేదు. ఇక వారం వ్యవధిలోనే ఈ సినిమా సిల్వర్ స్క్రిన్‌పై కనబడకుండా మాయమైంది. దీన్నిబట్టి ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు కూడా వర్మను పెట్టినట్లు కనిపిస్తోంది. ఎవరి ఓపికకైనా ఓ హద్దు ఉంటుంది కదా..!. ఇక తాజాగా మంచు మనోజ్, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్‌లతో రూపొందిస్తున్న 'ఎటాక్' అనే సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసినా అటు మీడియాగాని ఇటు ప్రేక్షకులుగాని ఏమాత్రం పట్టించుకోలేదు.