Advertisementt

సునీల్‌ మరో సినిమా మొదలుపెట్టాడు..!!

Mon 01st Jun 2015 04:39 AM
sunil,vamshi krishna akella,dil raju,sudharshan reddy  సునీల్‌ మరో సినిమా మొదలుపెట్టాడు..!!
సునీల్‌ మరో సినిమా మొదలుపెట్టాడు..!!
Advertisement
Ads by CJ

హీరోగా లాంచ్‌ అయిన మొదట్లో సునీల్‌ను వరుసగా విజయాలు పలకరించాయి. ఆ తర్వాత మాత్రం సోలో హీరోగా ఆయన వరుస ప్లాఫులను చవిచూస్తున్నాడు. ప్రేక్షకుల ముందుకు 'మిస్టర్‌ పెళ్లి కొడుకు'గా సునీల్‌ వచ్చి ఏడాదిన్నర దాటింది. ఆ తర్వాత ఆయన నుంచి సినిమాలు కరువయ్యాయి. ఆ తర్వాత దిల్‌రాజు నిర్మాతగా వాసు వర్మ దర్శకత్వంలో సునీల్‌ ఓ సినిమా మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా కొనసాగుతోంది. ఇంతలోనే సునీల్‌ మరో సినిమాకు పచ్చజెండా ఊపాడు.

రాంగోపాల్‌ వర్మ శిష్యుడు వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో సునీల్‌ ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ ఆదివారం ప్రారంభమైంది. గతంలో వంశీకృష్ణ జగపతిబాబుతో 'రక్ష' అనే సినిమా తీసిన వంశీకృష్ణ ఇప్పుడు సునీల్‌ను డైరెక్ట్‌ చేస్తున్నాడు. 'ప్రేమకథాచిత్రమ్‌' నిర్మాత సుదర్శన్‌రెడ్డి ఈ సినిమాను ప్రొడ్యూస్‌ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తవగానే రచయిత గోపీమోహన్‌ దర్శకత్వంలో సునీల్‌ నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ