హీరో లక్షణాలే ఏమాత్రం లేని వారు తెరపై సందడి చేస్తూ... వచ్చీరాని యాక్టింగ్‌తో విసిగిస్తూ... నవ్విస్తూ ఉంటే ఏదో తమ తాపత్రయం తాము చూపిస్తున్నారు అనుకొంటాం. అలాంటి వారిలో సంపూర్ణేష్‌బాబు బాగా క్లిక్కయ్యాడు. ఇప్పుడు సంపూతో సినిమాలు చేయడానికి దాసరి, వర్మ వంటివారు కథలు రాసుకుంటున్నారు అంటే విషయం అర్థం చేసుకోవచ్చు. అయితే చూడటానికి సంపూకు అన్నయ్యగా కనిపిస్తూ ఔరా.. అనిపిస్తున్నాడు బషీద్. ‘ఎవడ్రా హీరో’ సినిమాకు ఆయనే హీరో, నిర్మాత కమ్ డైరెక్టర్. యాక్షన్, డ్యాన్స్‌లు, డైలాగులు.. వామ్మో ట్రైలర్ చూస్తుంటేనే అర్థమైపోతోంది. అందులోనూ ఈ చిత్రంలో ఆయనకు ముగ్గురు హీరోయిన్లంట. నమిత, రేఖ, ‘ప్రేమిస్తే’ ఫేమ్ సంధ్య.. ఈ ట్రైలర్ ఒక్కసారి చూడండి... బషీద్‌తో పోలిస్తే సంపూనే సో...సో.. బెటర్ అని మీరే అంటారు. అయితే ఈ సినిమా ఇప్పటిది కాదు. సంపూ అనే వ్యక్తి ఎవరో తెలియక ముందు మొదలైంది. ఇప్పుడు ఏదోలా చేసి విడుదల చేస్తున్నారు. ఓపిక ఉంటే ఈ ట్రైలర్ చూసి హాయిగా నవ్వుకోండి.