Advertisementt

పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో అయినా రాణిస్తుందా...?

Sat 30th May 2015 09:54 AM
thapsi,police officer role,simbu,selvaraghavan  పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో అయినా రాణిస్తుందా...?
పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో అయినా రాణిస్తుందా...?
Advertisement
Ads by CJ
తెలుగులో పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్రలంటే చటుక్కున విజయశాంతి గుర్తొస్తుంది. ఆమె తర్వాత ఎవరెన్ని ఇలాంటి పాత్రలు పోషించినా ఎవ్వరూ ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. తమ కెరీర్‌కు ఇక ఫుల్‌స్టాప్‌ పడనుంది అనే స్జేజీలోనే నేటికాలం హీరోయిన్లు అలాంటి పాత్రలు చేస్తున్నారు. తాజాగా హీరోయిన్‌గా ఎలాంటి గుర్తింపును తెచ్చుకోలేకపోయిన తాప్సి ఓ తమిళ చిత్రంలో పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా నటిస్తోంది. విజయశాంతిని స్ఫూర్తిగా చేసుకొని ఆ పాత్ర చేస్తున్నానని ఆమె అందరితో చెబుతోందిట. తమిళంలో శింబు హీరోగా తాప్సి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం పేరు ‘కాన్‌’. సెల్వరాఘవన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కామెడీ చేసే పోలీస్‌ ఆఫీసర్‌గా కాకుండా సీరియస్‌గా కనిపించే పోలీస్‌ పాత్రలో తాప్సి నటించనుండటం విశేషం.
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ