మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ తన తొలి చిత్రం ‘ముకుంద’ పెద్ద విజయాన్ని సాధించకపోయినప్పటికీ నటునిగా ఆయనకు మంచి మార్కులే పడ్డాయి. కాగా వరుణ్‌తేజ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘కంచె’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మిగతా మెగాహీరోల లాగా మొదటి సినిమా నుండే మాస్ జపం చేయకుండా దిఫరెంట్ దర్శకులను, స్టోరీలను ఆయన ఎంచుకుంటున్నాడు. ఈ చిత్రానికి క్రిష్ తండ్రి జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నాడు. ప్రజ్ఞాజైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలోని ఫొటో ఒకటి లీకై ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. రెండో ప్రపంచ యుద్ద నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వరుణ్‌తేజ్ సైనికుడి పాత్రలో ఉండగా, హిట్లర్‌ను పోలిన నాజీ సైనికుని గెటప్‌లో మరోకరు పక్కన ఉన్నారు. కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జార్జియాలో జరుగుతోంది.