ఒక సూపర్‌స్టార్‌కు అల్లుడు, మరో సూపర్‌స్టార్‌కు బావ అయిన హీరో సుధీర్‌బాబు తన బావ మహేష్‌బాబుపై అలకబూనాడని సమాచారం. తన కెరీర్ మొదటి నుండి మహేష్ తనను సరిగ్గా ప్రమోట్ చేయడం లేదని, కనీసం తన సినిమా రిలీజ్‌ల సమయంలో ట్వీట్స్ కూడా చేయడం లేదని, కేవలం ఒకటి రెండు చిత్రాల ఆడియో వేడుకల వంటివాటికి మాత్రమే వచ్చాడని సుధీర్‌బాబుకు కోపంగా ఉందని సమాచారం. ఆయన తన ఫ్యాన్స్‌ను తన సినిమాలు చూడమని ఎంకరేజ్ చేయడం, సపోర్ట్ ఇవ్వడం, నిర్మాతలకు తన పేరును సజెస్ట్ చేయడం వంటివి చేయకపోవడం ఆయనకు బాధగా ఉందిట. ఇదే విషయాన్ని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయడని, కనీసం మహేష్ ఎంకరేజ్‌మెంట్ ఉండి ఉంటే ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రానికి కూడా మంచి కలెక్షన్లు వచ్చి నిర్మాతలు బాగుండేవారని ఆయన ఉద్దేశ్యంగా చెబుతున్నారు.